మనసారా నవ్వుకుందాం రా - 6 !
1." నేను రోజుకు ఆరేడు కవితలు రాసి పారేస్తుంటాను తెలుసా !" గర్వం గా చెప్పాడు అభ్యుదయ కవినని చెప్పుకొనే కామేశ్వరరావు.
" రాసి అవతల పారేస్తేనే మంచిది. వాటిని పత్రికలకు పంపించడం, రేడియోలలో , కవితా గోష్టులలో చదవడం చేస్తే మెదడు వాపు వ్యాధులు గట్రా వచ్చే ప్రమాదముంది." అసలు సంగతి చెప్పాడు రవీంద్ర.
2."నాకూ మా ఆవిడకు గొడవ వస్తే కొద్ది నిమిషాలలోనే సమసిపోతుంది తెలుసా !" కాలర్ ఎత్తుకొని గర్వంగా అన్నడు వాలేశ్వరరావు.
" అరే మీరెంతో గ్రేట్ రా! ఆ కిటుకేదో నాక్కూడా చెప్పకుడదా. మా ఇద్దరి మధ్య గొడవ గనుక లేస్తే గంటలకు గంటలు నడుస్తుంది" దీనంగా అడిగాడు పిచ్చేశ్వరరావు.
"ఏముంది, వెరీ సింపుల్. గోడవ మొదలైన వెంటనే మా ఆవిడకు దొరకకుండా నేను మంచం కిందకు దూరిపోతాను. నన్ను పట్టుకోలేక ఆ అప్పడాల కర్రను అవతల పారేసి మా ఆవిడ వెళిపోతుంది. ఆ తర్వాత నేను తాపీగా బయటకు వచ్చి ఆవిడ కోపం తగ్గేవరకు కాళ్ళు పట్టుకునే వుంటాను.అంతే ! ఆవిడ ఐసైపోయి నన్ను క్షమించేస్తుంది." అసలు సంగతి చెప్పాడు వాలేశ్వరరావు.




